‘Co-Win’ app for Covid vaccine
The central government is working hard on the covid-19 vaccine distribution process
🌼కొవిడ్ టీకాకు ‘కో-విన్’ యాప్
🎯దిల్లీ: కొవిడ్-19 టీకా పంపిణీ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది.
☀️ఈమేరకు వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు, ఎవరైనా టీకా కావాలనుకుంటే నమోదు చేసుకోవడానికి వీలుగా ‘కో-విన్’ పేరిట ఓ ఉచిత మొబైల్ యాప్‌ను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించింది.
☀️టీకా కోసం నమోదు చేసుకున్నవారి వివరాలు సహా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని(డేటా) ఇందులో పొందుపరుస్తారు.
☀️దేశవ్యాప్తంగా మొత్తం టీకా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ‘కో-విన్’ దోహదపడుతుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
☀️కో-విన్ యాప్‌లో 5 రకాల (అడ్మినిస్ట్రేటర్, రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, బెనిఫిషరీ ఎకనాలెడ్జ్మెంట్, రిపోర్ట్) మాడ్యూళ్లు ఉంటాయి. వీటిద్వారా వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు.
☀️టీకా వేసిన తర్వాత క్యూ-ఆర్ ఆధారిత ధ్రువపత్రాలను, ఎన్ని వ్యాక్సిన్ సెషన్లు నిర్వహించారనే వివరాలను కూడా యాప్‌లో ఉంచుతారు.
0 comments:
Post a comment