Cancel web counseling
MLC: Dr.AS Ramakrishna
వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయండి
-ఎమ్మెల్సీడా:ఏ.యస్.రామకృష్ణ
ఉపాధ్యాయులను తీవ్రయిబ్బందులకు గురిచేస్తున్న "వెబ్ కౌన్సిలింగ్" రద్దుచేసి,ఖాళీగా ఉన్న అన్ని ఫోస్టులను ఉపాధ్యాయులు కోరుకునే విథంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కృష్ణా,గుంటూరు టీచర్ MLC డా.ఏ.యస్ .రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఉపాధ్యాయులు వారి ప్రతినిధులు ఉద్యమబాట పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యామంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు.డైరక్టర్,విద్యాశాఖ కార్యదర్శి నివారణచర్యలు చేపట్టకపోగా ఉపాధ్యాయులను కించపరుస్తూ మాట్లాడుట గర్హనీయమన్నారు.ఇటువంటి అధికారులను తక్షణమే ఆ బాధ్యతల నుండితప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రస్తుత సమస్య వలన వేలాదిమంది ఉపాధ్యాయులు వీధిన పడినందున ముఖ్యమంత్రిగారు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని సి.యం గారికి విజ్ఞప్తి చేశారు
వారంలో రద్దుచేస్తామన్న సిపియస్ రద్దు అతీగతి లేదని,పిఆర్ సి ఫిట్ మెంట్ ప్రకటన ఎండమావిలా ఉందని అన్నారు.పెండింగ్ లో ఉన్న 3 డిఎ లు చిత్ర,విచిత్రంగా ప్రకటించుట దారుణమన్నారు.కావాలని ఇంకో 3 DA లు కరోనా పేరుతో శాశ్వతంగా ఎగవేయుట అన్యాయమన్నారు.ఉద్యోగుల పొట్టకొట్టిన ఏ ప్రభుత్వం మనుగడసాగించలేదని ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యమని కాబట్టి రద్దు చేసిన 3 DA లు పునరుద్థరించాలని,వాయిదాల పద్థతిలో ప్రకటించిన 3 DA లు తక్షణమే అమలుచేయాలని కోరారు
అందరికి అన్నీ చేస్తున్నాం అడిగినవి,అడగనవి కూడా ఇచ్చి సంక్షేమబాట పట్టించాం అని గొప్పలు చెబుతూ సంకలు ఎగరేసుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం పూర్తి ఉపాధ్యాయ,ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఇది కొత్త రాష్ట్రానికి శ్రేయష్కరం కాదని ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులకు మేలు చేసే చర్యలకు ఉపక్రమించాలని హితవు పలికారు.మీరు ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక మరియు పెన్షనర్ల కన్నీటిలో కొట్టుకుపోతారని అన్నారు
0 Comments:
Post a Comment