BRAOU Admissions: విద్యార్థులకు అలర్ట్.. ఆ యూనివర్సిటీలో అడ్మిషన్లకు గడువు పెంపు...
హైదరాబాద్ లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కీలక ప్రకటన చేసింది. డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీజీ (M.A, M.Com, M.Sc, M.B.A(I-CET ద్వారా), BLISc, MLISc, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని పొడిగింది. డిసెంబర్ 31 వరకు ఆయా కోర్సుల్లో చేరవచ్చని యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ డా. జీ. లక్ష్మారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్స్ లో ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in వెబ్ సైట్లో పొందుపర్చినట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని ఆయన తెలిపారు.
విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రతిష్టాత్మక ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ల గడువు పెంపు.. వివరాలివే.. ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు సకాలంలో కట్టలేక పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
బీటెక్, బీ.ఫార్మసీ, కోర్సులు చదవిన విద్యార్థులు సైతం ఓపెన్ వర్సిటీలో పీజీ కోర్సులైన ఎం.ఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ సోషియాలజీ, ఇంగ్లీష్, సైకాలజీ, జర్నలిజం తదితర కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-23680333/555 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
0 comments:
Post a comment