హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన టీఎన్జీఓఎస్ నాయకుడు, అశ్వాపురం ఎంపీడీఓ ఏలూరి శ్రీనివాస్ రావును సస్పెండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.పీ బండి సంజయ్ ను హైదరాబాద్ లో ఏలూరి శ్రీనివాస్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పలితాల తరువాత సంజయ్ ను కలవడం, కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలపై టీఎన్జీఓ నాయకులు భగ్గుమంటున్నారు. ఈ సస్పెన్షన్ ఉద్యోగ సంఘాల్లో అగ్గి రాజేస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో టిఎన్జీఓలందరినీ ఒక తాటిమీదకి తెచ్చి పెన్ డౌన్ వంటి కార్యక్రమాలలో కీలకంగా వ్యవహరించిన వారిలో శ్రీనివాసరావు ఒకరని అంటున్నారు.
ఇటీవల టీఎన్జీఓఎస్ నాయకుడు, మండలి మాజీ ఛైర్మన్ కె.స్వామి గౌడ్ కూడా బీజేపీ గూటికి చేరడం, అనంతరం ఏలూరి బండి సంజయ్ కలవడం టీఆర్ఎస్ నాయకులకు ఇబ్బందిగా మారింది. ఏలూరికి, ఒక రాష్ట్ర మంత్రికి మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయి. ఉద్దేశ పూర్వకంగానే తరచు తనను బదిలీ చేస్తూ, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాలుపడ్తున్నారని ఏలూరి ఇటీవలి కాలంలో ఆరోపణలు చేశారు.
0 comments:
Post a comment