స్కూల్ టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేక నిధి.
🌻సాక్షి, అమరావతి:
'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం టాయిలెట్ల నిర్వహణపై కూడా దృష్టి సారించింది ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా బాగుచేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న విషయమై శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో టేబుల్ అంశంగా చర్చించినట్లు తెలిసింది.
🌻ఇందుకోసం అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏడాది విద్యార్థుల తల్లులకు ఇస్తున్న రూ.15 వేల లోంచి రూ.వెయ్యి మినహాయించాలని తల్లిదండ్రులు కోరుతున్నందున దీనిపై మరింతగా చర్చించి, వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రతి పాఠశాలలో ఏర్పాటయ్యే నిధి నుంచి వచ్చే వడ్డీని టాయిలెట్ల నిర్వహణకు వెచ్చించాలన్న అభిప్రాయం కేబినెట్ లో వ్యక్తమైంది. ఈ నిధి ఏటా పెరుగుతుంది కనుక టాయిలెట్ల నిర్వహణ కష్టం కాబోదు.
0 Comments:
Post a Comment