🔳ప్రైవేటు స్కూళ్లను ఆదుకోండి: సీఎంకు సోము లేఖ
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కరోనా, లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వాటిని శాశ్వతంగా మూసేసేలా వ్యవహరించడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హితవుపలికారు. రాష్ట్రంలో 15 వేల ప్రైవేటు పాఠశాలలపై ఆధారపడి 3.50లక్షల మంది బతుకుతున్నారని, వారందరినీ రోడ్డుపాలుచేయడం సరికాదని సీఎం జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 40శాతం ఫీజులు ఆగిపోయి, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, భవనాల అద్దె చెల్లించలేక ఇబ్బందులతో స్కూల్ యాజమాన్యాలకు చెందిన 40మంది ప్రాణాలు కోల్పోయిట్లు వివరించారు. కాగా, ఏపీలో అమలవుతోన్న 30 పథకాల్లో కేంద్ర వాటా 60-90 శాతం ఉందని సోము వీర్రాజు తెలిపారు. వీటిపై సరైన ప్రచారం జరగడం లేదని, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ విభాగానికి చెందిన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
0 comments:
Post a comment