🌼ఇక నుంచి పల్లెల్లోకి వైద్యులు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు స్థితిగతులపై సమీక్షలో సిఎం జగన్మోహన్రెడ్డి..
☀️ఇక నుంచి వైద్యులు నేరుగా పల్లెలకు వెళ్లి సేవలందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 'ఆస్పత్రుల్లో నాడు-నేడు స్థితిగతుల' పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలలో రెండు రోజులు గ్రామాల్లోనే వైద్యులుండాలన్నారు.
☀️ప్రతి మండలంలోనూ కనీసం రెండు ప్రతి పిహెచ్‌సిలోనూ కనీసం ఇద్దరు చొప్పున నలుగురు డాక్టర్లు ఉండాలని చెప్పారు. ప్రతి డాక్టర్‌కూ మండల పరిధిలోని కొన్ని గ్రామాలను కేటాయించనున్నట్లు చెప్పారు. గ్రామాలకు వెళ్లినప్పుడు వైద్యునితో పాటుఆరోగ్య మిత్ర, ఆశావర్కర్లు కూడా ఉండాలన్నారు.
☀️గ్రామాలకు వెళ్లడం వలన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుందని, పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యకార్డుల్లో నమోదుకూ అవకాశం కలుగుతుందని చెప్పారు. కోవిడ్ సెకండ్‌వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై అధికారులు సిఎంకు ఈ సందర్భంగా వివరించారు. వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని, అందుబాటులోకి వచ్చిన మొదటి రెండు నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉన్నారని వెల్లడించారు.
0 comments:
Post a comment