బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కల్లోలం
లండన్: బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపం దాల్చింది. కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని, కొత్త రకం స్ట్రెయిన్‌పై నియంత్రణ కోల్పోయామని.. పరిస్థితి అదుపు తప్పిందని యూకే హెల్త్ సెక్రటరీ మాట్ హెన్‌కాక్ చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్డౌన్-4ను విధించింది. ఇతర దేశాలు కూడా యూకే నుంచి రాకపోకలపై నిషేధం విధించాలని భావిస్తున్నాయి. బ్రిటన్‌తో పాటు దక్షిణాఫ్రికా దేశాల్లో కూడా కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరపాటుకు లోనవుతున్నాయి. తాజాగా ఆ రెండు దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధాజ్ఞలు విధించేందుకు జర్మనీ ప్రభుత్వం పరిశీలనకు దిగింది. ఆయా దేశాల్లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతున్నందున.. అక్కడి నుంచి వచ్చే విమానాలపై జర్మనీ దృష్టి సారించింది. ఈ మేరకు జర్మనీ ఆరోగ్య అధికారులు మీడియాతో వెల్లడించారు
0 comments:
Post a comment