*📚✍తల్లిదండ్రుల కమిటీ పరిశీలనకు అమ్మఒడి జాబితా✍📚*
*🌻ఈనాడు, అమరావతి:* అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉంటే గుర్తించేందుకు ఈనెల 28న పాఠశాల తల్లిదండ్రుల కమిటీతో సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జాబితాలోని అనర్హులను గుర్తించే వారి పేర్లను రహస్యంగా ఉంచాలని సూచించింది. తల్లిదండ్రుల కమిటీ ఆమోదం అనంతరం 29న డేటాలో మార్పులు చేయకుండా స్తంభింపజేస్తారు. అనుమతి కోసం 30న గ్రామసభ ముందు జాబితాలను ఉంచుతారు. గ్రామసభ ఆమోదం తర్వాత ధ్రువీకరణ జాబితాను మండల విద్యాధికారులకు 31న ప్రధానోపాధ్యాయులు సమర్పిస్తారు. సమగ్ర శిక్ష అభియాన్తో సహా ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గ్రామీణంలో రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేల కంటే ఎక్కువ వేతనం ఉంటే వారిని అనర్హుల జాబితాలో చేర్చాలని పేర్కొంది.
0 comments:
Post a comment