🔳కేంద్ర ఉపకార వేతనాలకు గడువు పెంపు
కాకినాడ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రీ, పోస్ట్ మెట్రిక్, ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలకు డిసెంబరు 31వ తేదీ వరకు గడువు పెంచారని జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి పీఎస్ ప్రభాకరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ముస్లిం, క్రైస్తవ, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శికులు వర్గానికి చెందిన విద్యార్థులు http://scholarships.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
0 comments:
Post a comment