డీఎడ్, ఎల్పీటీ పరీక్షలకు ఓకే : మంత్రి సురేష్
🌻విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలోని డీఎడ్, ఎల్పీటీ (లాంగ్వేజీ పండిట్ ట్రైనింగ్) కళాశాలల్లో 2018-20, 2018-19 బ్యాచ్ లో సీట్లు పొందిన అభ్యర్థుల పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు ఆదివారం మంత్రి ఒక సర్క్యులర్ జారీ జేశారు. ప్రజాప్రతినిధులు విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విజ్ఞాపనలను గమనించామన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించగా.. డీఎడ్, ఎలక్టీ అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారన్నారు. 2018-20, 2018 -19 బ్యాచ్ అభ్యర్థులకు న్యాయం చేసేలా చూస్తామని, త్వరలో వారి పరీక్షల నిర్వహణకు షెడ్యూలు జారీ జేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య కోటాలో ప్రవేశాలు కల్పించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment