టీసీల్లేని చదువులా ? ! అసలుకే ఎసరు !
సర్కారీ విద్యకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వ విద్యకు మంచి రోజులు రావాలన్న ఆకాంక్షతో చర్యలు అందులో భాగంగానే టీసీలపై నిర్ణయం ..
కానీ ప్రజల ఆలోచనలు వేరు
ప్రభుత్వ నిర్ణయాన్ని సానుకూలంగా వాడుకునే ఎత్తుగడ ..
ఈ 4 నెలలు ప్రభుత్వ బడుల్లో చేరికకు ఎత్తులు
కొత్త విద్యా సంవత్సరంలో టీసీలతో బయటకు వెళ్లేచ్చన్న ప్లాన్
జాగ్రత్త పడకపోతే ప్రభుత్వ నిర్ణయం వికటించే ప్రమాదం
టీసీలు .. మార్కుల లిస్టులు .. స్టడీ సర్టిఫికెట్లు .. విద్యా వ్యవస్థలో వీటికి ఉన్న విలువే వేరు . విద్యార్థి భవితవ్యాన్ని ఒక్కోమెట్టూ ఎక్కించే సాధనాలు . చదువులు గాడి తప్పకుండా నిలువరించే ఉపకరణాలు . కానీ ఇవేవీ చదువుకి అక్కర్లేదని అంటే..పరిణామాలు ఊహకు అందవు . అంటే అంతటి నష్టాన్ని కలుగజేస్తాయి . విద్యార్థులకు చదువు మీద సీరియస్నెస్ పోతుంది . క్రమశిక్షణ లోపిస్తుంది . స్థాయికి తగ్గట్టు కాకుండా పైచదువులకు వెళ్లేకొద్దీ విద్యార్థికి విద్యాప్రమాణాలు అడుగంటుతాయి . ఈ విషయంలో ప్రభుత్వాలు పునరాలోచన చేసి , విద్యావ్యవస్థ గాడి తప్పకుండా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం సర్కారీ విద్యకు ఆకర్షణ పెంచే ప్రయత్నాలు చేపట్టింది . ప్రైవేటు , కార్పొరేట్ పాఠశాలల్నుంచి కూడా విద్యార్ధులు సర్కారీ బళ్ళకొచ్చే విధంగా పథకాలు రూపొందించింది . ఇందుకోసం నాడు - నేడు పేరిట వేల కోట్ల వ్యయంతో సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది . వీటి కోసం నూతన భవనాలు నిర్మిస్తోంది . ఇంగ్లీష్ మీడియం అమల్లోకి తెస్తోంది . ఈ విద్యాసంస్థల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు . పైగా ఇక్కడ చేరిన విద్యార్థుల తల్లులకు అమ్మఒడి అమలు చేస్తోంది . విద్యార్ధులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అంది స్తోంది . దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్నుంచి కూడా విద్యార్ధులు ప్రభుత్వ బడులవైపు తరలొస్తారని అంచనాలేస్తోంది . వీర్ని మరింత ప్రోత్సహించేదుగ్గాను ఇలా ప్రైవేటు పాఠశాలల్నుంచి వచ్చే వారికి ఎలాంటి టీసీలు , మార్కులిస్టులు , స్టడీ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదంటూ వెల్లడించింది .
ప్రభుత్వ ఆలోచన ఒకటైతే . విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచన ఇంకో విధంగా ఉంది . ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని వారు తమకనుకూలంగా మార్చుకుంటు న్నారు . ఇప్పటికే డిసెంబర్ వచ్చేసింది . లా డౌన్ తర్వాత ఇంతవరకు విద్యా సంస్థల్ని తెరవలేదు . 8 , 9 , 10 తరగతులకు తెరిచినా పెద్దగా విద్యార్థులు హాజరుకావడంలేదు . ఇ క ప్రైవేటు , కార్పొరేట్ పాఠశాలలైతే తొలుత ఆన్లైన్లో విద్యాబోధన ప్రారంభించాయి . ఆ విధంగా తల్లిదం డ్రుల్నుంచి ఫీజులు వసూలు చేయడం మొదలెట్టాయి . అయితే ఆన్లైన్ చదువులపై ప్రభుత్వం కత్తిదూసింది . పాఠశాలలు తెరవకుండా ఫీజుల వసూలుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది . దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు వెనక్కి తగ్గాయి . ఇప్పుడు కోవిడ్ ప్ర భావం తగ్గు ముఖం పట్టడంతో నెమ్మదిగా విద్యాసంస్థలు తెరిచేందుకు సంసిద్ధమౌ తున్నాయి . ఇక ఈ విద్యాసంవత్సరంలో మిగి లింది . నాలుగుమాసాలే అయినప్పటికీ ఏడాది ఫీజుల్ని చెల్లించమంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి . ఈ నాలుగు నెలల్లో చదివి కొత్తగా తమ పిల్లలు నేర్చుకునేదేమీ ఉండదన్న భావం తల్లిదండ్రుల్లో ఏర్పడింది . ఈ నాలుగు మాసాల చదువు కోసం ఏడాది ఫీజులు చెల్లించడం ఎందుకన్న ఆలోచన తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది . ఇప్పటికే రిమాసాలు తమ పి ల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకున్నందున మిగిలిన నాలుగు మాసాలు ప్ర భుత్వ పాఠశాలల్లో చేర్చాలన్న వ్యూహాలు అమలు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమౌతున్నారు .ఎలాగూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికకు టిసిలు , మార్కు లిస్టులు అవసరం లేదు.వయసును బట్టి చేర్చుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది . దీంతో ఈ నాలుగు మాసాలు ప్రభుత్వ పాఠశాలల్లో చది వించి ఆ తర్వాత అక్కడిచ్చే టీసీ ఆధారంగా పై తరగతుల నిమిత్తం ప్రైవేటు పాఠశాలలకు పంపించడం మేలన్న ఉద్దేశ్యం వారిలో వ్యక్తమౌతోంది . ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాల ప్రయోగాలు చేస్తుంటే ప్రజలు ప్రభుత్వ ఆలోచనను మిం చి వ్యవహరిస్తున్నారు . వాటిలో తమకనుకూలమైన అంశాల్ని మాత్రమే ఎంచుకుని అమలు చేస్తున్నారు . టీసీ అక్కర్లేదన్న ఒకే ఒక నిర్ణయం ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతోంది . వేల కోట్ల వ్య యంతో తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థను తల్లి దండ్రులు తమ ఇష్టానికనుగుణంగా వినియోగించుకునే వెసులుబాటునిస్తోంది . ఇప్పటికైనా టీసీల విషయంలో ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు . లేని పక్షంలో నాడు నేడు పథకం విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు మాసాల పాటు ప్రభుత్వాన్ని వినియోగించుకునేందుకే పరిమితమౌతుందని విశ్లేషిస్తున్నారు .
0 Comments:
Post a Comment