సోషల్ మీడియా టెక్ దిగ్గజం వాట్సాప్ వినియోగదారుల కోసం మరో కొత్త అప్షన్ తో ముందుకు వస్తోంది. త్వరలో ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునే సౌలభ్యాన్ని కల్పిం చనుంది. ఫేస్ బుక్ యాజమాన్యంలో నడుస్తున్న వాట్సాప్ 2021 లో ఫైనాన్స్, కామర్స్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమానికి తన సేవలను విస్తరించడానికి సిద్ధమవుతోంది. వాట్సాప్ ఆరోగ్య భీమా, మైక్రో పెన్షన్ ఉత్పత్తులను భారతదేశంలో తన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో లైసెన్స్ పొందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లేయర్‌లతో జతకట్టనుంది.
ఈ ఏడాదిచివరి నాటికి వాట్సాప్ ఇన్సూ రెన్స్ సేవలను అందుబాటులోకి తేనుంది. గత కొద్ది రోజులుగా జరుగుతోన్న చర్చల నేపధ్యంలో… ఆరోగ్య బీమా కోసం ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌తో వాట్సాప్ జత కట్టింది.
అయితే, పెన్షన్ సేవల కోసం హెచ్‌డీ ఎఫ్‌సి పెన్షన్స్, పిన్‌బాక్స్ సొల్యూషన్స్‌తో వాట్సప్ కలిసి పనిచేస్తోంది. ఎడ్-టెక్, అగ్రి-టెక్‌ల్లోనూ ఇదే తరహా పైలట్ ప్రాజెక్టులను వాట్సప్ చేపట్టనుంది.
మైక్రో రుణాలు, పెన్షన్లు ఇతర ప్రొడక్టుల కోసం వాట్సప్ ఆర్థిక సేవల రంగంలోని భాగస్వాములతో కలిసి పని చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా రోజుకు రూ.50 కంటే తక్కువ మొత్తంతో స్వయం ఉపాధి పొందుతున్న 300 మిలియన్ల మందికి పెన్షన్ సదు పాయాన్ని కల్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వాట్సప్ ఇండియా తెలిపింది.
యుపీఐలను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. 20 మిలియన్ల మంది వినియోగదారులకు పేమెంట్ సేవలు అందించేలా వాట్సాప్‌కు నవంబర్‌లో అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. యుపీఐ కోసం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులతో వాట్సాప్ జతకట్టిన విషయం విదితమే. ఇదే క్రమంలో… వాట్సాప్ వినియోగదారులకు త్వరలో బీమా సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
మొదటి దశ ప్రయోగంలో భాగంగా తక్షణ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఎస్‌బిఐ జనరల్‌తో కలిసి సాచెట్-హెల్త్ ఇన్సూరెన్స్ కవర్, హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్‌ను ప్రారంభించడానికి జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) యాప్ ద్వారా సేవలను అందిస్తామని భారత వాట్సాప్ అధిపతి అభిజిత్ బోస్ తెలిపారు. గత కొన్ని నెలలుగా కంపెనీ పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్న ఈ మైక్రో ఫైనాన్స్ చెల్లింపులు చేస్తున్నామని బోస్ బుధవారం ఫేస్ బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 కార్యక్రమంలో వెల్లడించారు.
0 Comments:
Post a Comment