📗 Esr - ఇ-ఎస్‌ఆర్.. అంతం లేని కథ!
కొత్త జీవోతో మొదటికి వచ్చిన ప్రక్రియ....
😨 లబోదిబోమంటున్న టీచర్లు
📗 ప్రభుత్వం పారదర్శకత కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఇ-ఎస్‌ఆర్ ప్రక్రియ ఆర్థిక శాఖ మార్పులు, చేర్పులతో మళ్లీ మొదటికి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే అమలు చేయాలని సంకల్పించినా వాయిదా పడింది. ఈ ఏడాది మార్చిలో ఆర్థికశాఖ అన్ని శాఖలకు ఇ-ఎస్‌ఆర్ ప్రక్రియ అమలు చేయాలని, జూన్ నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలిపింది. జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇ-ఎస్‌ఆర్ ప్రక్రియ మొదలుపెట్టారు.
📗 ఉపాధ్యాయులకు నిర్దేశిత కాలపరిమితి విధించడంతో కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లోనే అంతర్జాల కేంద్రాల చుట్టూ తిరుగుతూ కొంత మంది కరోనా బారిన పడ్డారు.
💁🏻♀️మొదట్లో పూర్తి వివరాలు....
📗 ఇ-ఎస్‌ఆర్ కోసం మొదట్లో ఆర్థికశాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో 12 విభాగాలకు చెందిన అన్ని వివరాలు పొందుపరిచేలా రూపొందించారు. కుటుంబ వివరాలు, ఆస్తులు, వాహనాలు, ధ్రువీకరణ పత్రాలు వంటివి ఉన్నాయి. ఒక్కో ఉద్యోగి కనీసం 2, 3 రోజులైనా కంప్యూటర్ ముందు కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాఫ్ట్‌వేర్‌లో వివరాలు తగ్గించి కొంత సులభతరం చేయగా.. మళ్లీ పూర్తి వివరాలు పొందుపరిచారు. చాలా వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఫైనల్ సబ్‌మిషన్ చేశారు. అవి ఇప్పుడు డీడీవోల దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.
💁🏻♀️ జీవో నంబరు 99 జారీ....
📗 ఆర్థిక శాఖ గురువారం జీవో నంబరు 99 విడుదల చేస్తూ.. ప్రతి ఉద్యోగి ఇ-ఎస్‌ఆర్ ప్రక్రియను డీడీవోలు డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు పూర్వప్రకారమే ఎస్‌ఆర్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనేక ఆపసోపాలు పడి పూరించిన ఉద్యోగులు ఇదెక్కడి చోద్యం అంటూ వాపోతున్నారు. గతంలో పూర్తిచేసిన వారి వివరాలు అలాగే ఉంచాలని, మిగిలిన వారివి మాత్రమే డీడీవోలు చేసేలా మార్పు చేయాలని కోరుతున్నారు.
💁🏻♀️ సబ్మిట్ చేసిన వివరాలు కొనసాగించాలి....
📗 ఇప్పటికే మూడుసార్లు ఇ-ఎస్‌ఆర్ ప్రక్రియ పూర్తిచేశారు. గతంలో పూరించిన అంశాలను కొనసాగించాలి. గతంలో సెలవు లెడ్జర్ ప్రక్రియ చాలా ఇబ్బందులకు గురిచేసింది. మళ్లీ వివరాలు పొందుపరచాలనడం సబబు కాదు. మహిళా ఉద్యోగులకు మరింత కష్టతరం.
0 Comments:
Post a Comment