నాడు - నేడుతో పాఠశాలలకు మహర్దశ.. రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులు చినవీరభద్రుడు
అద్దంకి/బల్లికురవ, డిసెంబరు 30 : -
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, ఎక్కువ మంది విద్యార్థులు బడిబాట పట్టేలా అందూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు ఓడరేవు చినవీరభద్రుడు కోరారు. బుధవారం నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసిన కొణిదెన ప్రాథమిక పాఠశాల, గుంటుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా చినవీరభద్రుడు మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అనంతరం కొణిదెన గ్రామాన్ని పరిశీలించిన ఆయన చోళులు పరిపాలన సాగించిన గుర్తుగా పాఠశాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నన్నేచోళుడు భవనంగా నామకరణం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే శింగరకొండ సమీపంలోని గురుకుల పాఠశాల, అద్దంకి పట్టణంలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. అద్దంకిలోని తొలి పద్యశాసనం, ఎర్రన విగ్రహాలను ఆయన పరిశీలించారు. ఆయనవెంట ఆర్జేడీ రవీంద్రుడు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి డీఈవో సుబ్బారావు, డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో వీరరాఘవయ్య, ఎంఈవో వీరరాఘవయ్య, ఈఈ సుందరరామిరెడ్డి, ఏఈలు శ్రీరామమూర్తి, రోహిణి, ప్రిన్సిపాల్ వాసవి, రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.
0 comments:
Post a comment