✍పారా మెడికల్ ఫీజులు ఖరారు
♦ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
🌻అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సింగ్, ఆయూష్ విభాగాలు సహా వివిధ పారామెడికల్ కోర్సులకు ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు 2020-21, 2022-23 సంవత్సరాలకు ఖరారు చేసిన ఫీజులు వర్తించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటా ఫీజు రూ. 18 వేలు, మేనేజ్ మెంట్ కోటాకు రూ. 80 వేలు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటా ఫీజు రూ. 18 వేలు కాగా మేనేజ్ మెంట్ కోటాకు రూ. 80 వేలుగా నిర్ణయించారు. ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటాలో ఫీజు రూ వేలు గాను, మేనేజ్ మెంట్ కోటా ఫీజు రూ. 1.49 లక్షలుగాను, బీపీటీ కోర్సులో కన్వీనర్ కోట ఫీజు రూ.18 వేలు, మేనేజ్ మెంట్ కోటా ఫీజు రూ. 80 వేలు, ఎంపీటీ కోర్సులకు కన్వీనర్ కోటా సీటుకు రూ.94 వేలు, మేనేజ్మెంట్ కోటా ఫీజు కింద రూ. 1.60 లక్షలుగా పేర్కొన్నారు.బీహెచ్ఎంఎస్ కోర్పుల్లో కన్వీనర్ కోటాకు రూ 22 వేలు గాను, మేనేజ్ మెంట్ కోటా ఫీజుగా రూ. 3 లక్షలు, బీఎస్సీ, ఎంఎల్టీ కోర్సులకు ఫీజు కింద కన్వీనర్ కోటాలో రూ.18 వేలు, మేనేజ్మెంట్ కోటాకు రూ 80 వేలు, డీఎంఎల్టీ, పారామెడికల్ డిప్లమో కోర్సులకు కన్వీనర్ కోటాలో రూ. 14 వేలు, మేనేజ్ మెంట్ కోటాలో రూ.45 వేలు, జీఎన్ఎం కోర్సుకు కన్వీనర్ కోటాగా రూ. 15,500, మేనేజ్ మెంట్ కోటాలో రూ. 72 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
0 comments:
Post a comment