Vidyadan Scholarships for AP Students
ఏపీ విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్షిప్ లు
ఆంధ్రప్రదేశ్లోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) విద్యార్థులు విద్యాదాన్ స్కాలర్షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కుటుంబ ఆదాయం రూ.2లక్షలు మించని విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులు.
దీంతోపాటు విద్యార్థులు 2020లో పదోతరగతి పాసై, తొమ్మిదో తరగతిలో 90 శాతం మార్కులు లేదా 9 సీజీపీఏ(వికలాంగులు 75 శాతం) సాధించి ఉండాలి.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ లేదా డిప్లొమా కోర్సు చదువుతూ ఉండాలి.
ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.6వేలు చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్ అందిస్తారు.
ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు.. కోర్సును బట్టి ఏడాదికి రూ.10వేల నుంచి రూ.60వేల వరకు స్కాలర్ఫిప్ పొందవచ్చు.
అర్హతలు, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల(డిసెంబర్) 31వ తేదీలోగా ఫౌండేషన్ వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి.
వీరికి 2021 జనవరి 5 నుంచి 10వ తేదీ వరకు రాత/మౌఖిక ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: www.vidyadhan.org
0 comments:
Post a comment