పరీక్షలు వాయిదా వేయండి.. సిలబస్ తగ్గించండి!
కేంద్ర విద్యాశాఖకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల విజ్ఞప్తి
10న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కేంద్రమంత్రి చర్చ
☀️COVID 19 పరిస్థితులతో 2021లో పరీక్షల సంగతి ఏమిటో ఎవరికీ అర్థంకావడంలేదు. విద్యారంగంలో నెలకొన్న ఈ అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు.
☀️ఈ నెల 10న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్ చర్చా వేదిక ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
☀️వచ్చే ఏడాదిలో నిర్వహించాల్సిన సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షల నిర్వహణపై కీలకంగా చర్చించనున్నారు.
☀️ఇందుకోసం #EducationMinisterGoesLive హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఆయా వర్గాల నుంచి ప్రశ్నలను, సలహాలు, అభిప్రాయాలను ఆహ్వానించారు.
☀️వాస్తవానికి డిసెంబర్ 3న ఈ వెబినార్ జరగాల్సి ఉన్నప్పటికీ ఈ నెల 10కి వాయిదా పడింది.
0 Comments:
Post a Comment