ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్. తాజాగా బంగారంపై అతి తక్కువ వడ్డికే రుణాలనందిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం 7.5 వడ్డీతోనే గోల్డ్ రుణాలను అందించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ కాయిన్స్ పై కూడా రుణాలనివ్వనున్నారు. తొలుత రూ. 20 లక్షల వరకు మాత్రమే ఉన్న రుణ పరిమితిని తాజాగా రూ. 50 లక్షలకు పెంచారు. ఈ రుణాన్ని పొందేందుకుగాను 18 ఏండ్లు పైబడిన వారు అర్హులని ఎస్బీఐ ప్రకటించింది. ఇక ఈ రుణాన్ని పొందేందుకుగాను ఎలాంటి ఆదాయ ధృవీకరణాలనూ అందించాల్సిన అవసరం లేదు.
0 comments:
Post a comment