ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ బట్టలు ఉతక్కుండానే శుభ్రం చేసే వినూత్నమైన 'ఎల్‌జి స్టైలర్'ను విడుదల చేసింది. గురువారం దీన్ని హైదరాబాద్‌లో ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ అప్లియెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విపి విజరు బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్టీమ్ సాంకేతిక పరిజ్ఞానంతో స్టైలర్ పని చేస్తుందన్నారు. దీనికి ఎలాంటి రసాయనాలు లేదా డిటర్జెంట్లను ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారు. స్టీమ్ సాంకేతికతతో వేలాడదీసిన దుస్తుల నుండి దుమ్ము, పురుగులను, ముడతలను తొలగిస్తుందన్నారు. దీన్ని ఎక్కడి నుంచైనా రిమోటు లేదా వైఫై సహాయంతో ఆపరేట్ చేయవచ్చన్నారు.
దుస్తులను రిఫ్రెష్ చేయడానికి, పొడిగా లేదా శుభ్రపరచడానికి, వస్త్రాల రకాన్ని బట్టి మరో 20 ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. గ్రీన్ లాండ్రీని ప్రోత్సహించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. దీని ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించామన్నారు.
0 Comments:
Post a Comment