🔳పారదర్శకంగా బదిలీల ప్రక్రియ
ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు సిద్ధం: మంత్రి సురేష్
పారదర్శకంగా బదిలీల ప్రక్రియ
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోమంగళవారం విలేకరులతోమాట్లాడారు. జీవో నం.53, 54 ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులకు నచ్చిన విధంగా ఆన్లైన్లో పారదర్శకంగా చేపట్టినట్లు వివరించారు. వీటిపై ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బదిలీల వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేటగిరీ 1, 2, 3, 4లో 48,879 ఖాళీలుండగా.. 19,784 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉందన్నారు. దీంతో భర్తీ ప్రక్రియ 16 వరకూ పొడిగించామన్నారు. ప్రధానంగా కేటగిరీ-4పై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తామని, దీనికోసం జీవో 59ను సవరించినట్లు తెలిపారు. వెబ్ ఆప్షన్‌ను 58.55 శాతం మంది ఉపాధ్యాయులు వినియోగించుకున్నట్లు చెప్పారు. ఇంకా 16,008 ఖాళీలను బ్లాక్‌లిస్టులో ఉంచామని, వీటి భర్తీని తర్వాత చేపడతామన్నారు. సీనియర్లకు పాయింట్లు ఇస్తున్నామన్నారు. ఎక్కడైనా 33 ఏళ్లు పనిచేస్తే 16.5 పాయింట్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
0 comments:
Post a comment