అమ్మఒడి’ కోసం అవస్థలు
♦సచివాలయాల వద్ద తల్లుల పడిగాపులు
♦ఎమ్మార్సీల్లో ఉపాధ్యాయుల నిరీక్షణ
🌻ఒంగోలు విద్య, డిసెంబరు 23 : జగనన్న అమ్మఒడి అర్హుల ప్రాథమిక జాబితాలో పేర్లులేని తల్లుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ తమ పేర్లు కనిపించకపోవడంపై వారు నిసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన అన్ని సర్టిఫికెట్లను తీసుకెళ్లి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం నుంచే తల్లులు నుంచి అభ్యంతరాలు, అభ్యర్థనలు స్వీకరించేందుకు గ్రామ సచివాలయాలకు లాగిన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆమేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో తల్లులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాల వద్ద పడిగాపులు కాసి వెనుతిరిగారు. ఇదిఇలా ఉండగా బదిలీ కోసం దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు అప్షన్‌ల పెట్టుకొనేందుకు మండల విద్యావనరుల కేంద్రాలకు వెళ్ళగా పాఠశాలల్లో అమ్మఒడి అభ్యంతరాలు, అభ్యర్థలనపై సలహాలు ,సూచనలు ఇచ్చే నాథుడు కరువయ్యారు.
🌻జిల్లాలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1 తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు 5,26,237 మంది ఉన్నారు. వీరిలో 4,64,394 మంది అమ్మఒడికి అర్హులైనట్లు తొలిజాబితాలోనే ప్రకటించారు. 54,724 మంది విద్యార్థులను వివిధ కారణాలతో అనర్హులుగా తేల్చారు. 7119 మంది పేర్లను విత్‌హెల్డ్‌లో ఉంచారు. విద్యార్థులు, తల్లుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు తదితర తప్పులు దొర్లడంతో వీరిని విత్‌హెల్డ్‌లో ఉంచారు. వీటిని పాఠశాల హెచ్‌ఎం ఎంఈవో లాగిన్‌లో సరిచేయించుకొనే అవకాశం ఉంది. అయితే అనర్హులుగా ప్రకటించిన 54,724 మంది విద్యార్థుల తల్లులు మాత్రం సచివాలయానికి వెళ్లి అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించి సరిచేయించుకోవాల్సి ఉంది. అభ్యర్థనలు స్వీకరించేందుకు సచివాలయాలకు బుధవారమే లాగిన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం అపనిచేయకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
♦26న తుది జాబితా
అమ్మఒడి పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులైన తల్లుల తుది జాబితాను ఈనెల 26న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తల్లుల్లో మరింత అందోళన పెరిగింది. 25న క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు, సచివాలయాలకు సెలవులు. దీంతో సర్టిఫికెట్లు సమర్పించేందుకు కేవలు రెండు రోజులు మాత్రమే వ్యవధి ఉంది.
♦అనర్హులను తొలగించాలి
జిల్లాలోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ఎవరైనా అనర్హులు ఉంటే డిలీట్ అప్షన్ ఉపయోగించి వారిని జాబితా నుంచి తొలగించాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు. అభ్యంతరాలు సేకరించి గ్రామ సచివాలయాల్లో సమర్పించి ఈనెల 31నాటికి గ్రామసభల్లో అర్హుల తుది జాబితాను ఆమోదించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల జాబితాల్లో తప్పులు దొర్లితే సంబంధిత పాఠశాలల కరస్పాండెంట్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
0 Comments:
Post a Comment