✨ కోడిగుడ్ల పరిమాణం తగ్గితే తీసుకోవద్దు..
★ మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసే కోడిగుడ్ల పరిమాణం తక్కువగా ఉంటే తీసుకోవద్దని ఆ పథక రాష్ట్ర సంచాలకుడు దివాన్ మైదీన్ అన్నారు.
★ పెదపాడు మండలం అప్పనవీడు, కలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలు, దెందులూరు మండలం గోపన్నపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొవ్వలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
★ ఆయా పాఠశాలల్లో ‘జగనన్న గోరుముద్ద’, డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
★ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు.
★ ‘మనబడి నాడు-నేడు’ పనుల నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
★ విద్యార్థులకు అవసరమైన కోడిగుడ్లు, చిక్కీలను నిర్ణీత సమయంలో సరఫరా చేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్నారు.
★ ఆయన వెంట పశ్చిమగోదావరి డీఈవో సీవీ రేణుక, మధ్యాహ్న భోజన పథకం ఏడీ వరదాచార్యులు, పర్యవేక్షకుడు మోహన్, ఎంఈవో ఎస్.నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.
0 comments:
Post a comment