న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. ఏడవ వేతన కమిషన్ సిఫారసుల మేరకు వచ్చే ఏడాది వారి వేతనాలు, పెన్షన్లు పెరుగనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్‌లో నిలిపివేసిన డీఏను కూడా ప్రభుత్వం పునరుద్ధరించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలుస్తున్నది. గత మార్చిలోనే డీఏ పెంపునకు నిర్ణయం తీసుకున్నా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాది జూలై వరకు దాని అమలుపై ఆంక్షలు విధిస్తూ ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
ఏడవ వేతన కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ఉద్యోగులు 21 శాతం డీఏ పొందనున్నాయి. ప్రస్తుతం 17 శాతం డీఏ అమలులో ఉంది.
దీనివల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 60 లక్షల మందికి పైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కేంద్రం ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు డీఏ పెంపు ప్రతిపాదన రాగా, మార్చిలో నిర్ణయం తీసుకున్నది.
0 Comments:
Post a Comment