యూజీ, పీజీ ఫీజులు ఖరారు!
మూడు కేటగిరీలుగా కాలేజీల విభజన
మొదటిసారిగా యూనిఫాం ఫీజు విధానం
☀️అండర్ గ్రాడ్యుయేట్(యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కొత్త ఫీజులు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 1,133 డిగ్రీ కాలేజీలను వాటి పనితీరు, మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి, కోర్సుల వారీగా ఫీజులు నిర్ధారించారు. 2020--23 వరకు మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌కు ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసు చేయగా ప్రభుత్వం ఆమోదించిననట్లు సమాచారం. ఆయా ఫీజులకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో మొదటి సారిగా డిగ్రీ కాలేజీల్లో యూనిఫాం ఫీజు విధానం అమల్లోకి రానుంది. గత విద్యాసంవత్సరం వరకు ఒకే కోర్సుకు వర్సిటీల్లో వేర్వేరు ఫీజులు ఉండేవి. అయితే రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటైనతర్వాత డిగ్రీ, పీజీ కోర్సులకు యూనిఫాం ఫీజు విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికశాఖ వద్ద ఉన్న ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
🍁యూజీ కోర్సులకు....
☀️యూజీ కోర్సులు అందిస్తున్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు 1,133 కాగా.. కేటగిరీ-1లో 148, కేటగిరీ-2లో 375, కేటగిరీ-3లో 610 కాలేజీలు ఉన్నాయి. కేటగిరీ-2, 3లో ఉన్న కాలేజీలకు తక్కువ ఫీజులను ప్రతిపాదించారు.
☀️కేటగిరీ-1 కాలేజీల ఫీజులు: బీఏ రూ.10వేలు, బీకాం (కంప్యూటర్స్) రూ.15వేలు, బీకాం(జనరల్) రూ.12, 500, బీఎస్సీ (రీస్ట్రక్చర్డ్ కోర్సులు) రూ.16,500, బీఎస్సీ( కన్వెన్షనల్) రూ.15 వేలు, బీసీఏ రూ.19 వేలు, బీబీఏ రూ. 18,500, బీహెచ్‌ఎం రూ.30 వేలు, బీఎస్సీ(ఫుడ్ టెక్నాలజీ) రూ.30 వేలు
🍁పీజీ కోర్సులకు....
☀️పీజీ కోర్సులు ఆఫర్ చేస్తున్న కాలేజీలు 211 కాగా, ఇందులో కేటగిరీ-1లో 71, కేటగిరీ-2లో 71, కేటగిరీ-3లో 69 కాలేజీలు ఉన్నాయి. కేటగిరీ-1 కాలేజీల ఫీజులు: ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ రూ.15,500, ఎంఏ(లాంగ్వేజెస్) రూ.13,500, ఎమ్‌కాం రూ.15,400, ఎంఎస్సీ రూ.29,700. కేటగిరీ-2, 3లో ఉన్న కాలేజీలకు తక్కువ ఫీజులను ప్రతిపాదించారు.
0 Comments:
Post a Comment