🌼నేడు అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాలు
☀️జగనన్న అమ్మ ఒడి రెండో విడత లబ్ధిదారుల జాబితాలను సోమవారం పాఠశాలలకు, గ్రామ సచివాలయాలకు పంపించనున్నారు.
☀️పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు గడువు శనివారం ముగియడంతో అర్హులైన విద్యార్థుల తల్లుల జాబితాలను ఆన్లైన్లో సిద్ధం చేస్తున్నారు.
☀️ఆన్లైన్ పరిశీలన అనంతరం జాబితాలు
విడుదల చేస్తారని విద్యాశాఖ అధికారులు ఇటీవల జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
☀️అర్హులైన పేర్లు అనర్హుల జాబితాలో ఉంటే సంబంధిత పాఠశాలల్లో వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
☀️వీటిని ప్రధానోపాధ్యాయులు నమోదు చేసి వివరాలను జాయింట్ కలెక్టర్లకు పంపిస్తారు. వీటిని పరిశీలించి ఆమోదిస్తే ఇలాంటి పేర్లను అర్హుల జాబితాలోకి చేర్చుతారు.
0 comments:
Post a comment