ఐసీఐసీఐ మొబైల్ యాప్‌లో కీలక మార్పు
ఇక ఇతర బ్యాంకు వినియోగదారులూ వాడుకోవచ్చు.
☀️ముంబయి: ఐసీఐసీఐ బ్యాంకు మరో వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. తమ మొబైల్ చెల్లింపుల యాప్ కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇతర బ్యాంకుల వినియోగదారులు సైతం ఈ యాప్ ద్వారా చెల్లింపులు, బ్యాంకింగ్ సేవలు పొందగలగడం విశేషం. ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌నకు ‘ఐమొబైల్ పే’ అని నామకరణం చేసింది ఆ సంస్థ.
☀️సేవింగ్స్ ఖాతా, పెట్టుబడులు, రుణాలు, క్రెడిట్ కార్డులు, గిఫ్ట్‌కార్డులు, ట్రావెల్ కార్డుల వంటి సత్వర బ్యాంకు సేవలను ఐమొబైల్ పే ద్వారా పొందొచ్చని ఐసీఐసీఐ తెలిపింది. ఈ తరహా యాప్ రావడం ఇదే తొలిసారని తెలిపింది.
0 Comments:
Post a Comment