*🔯మరోసారి మారిన ఇన్‌కమ్ ట్యాక్స్ దాఖలు చివరి తేది..*
➪తాజాగా ప్రకటించిన తేదీ ఎప్పుడంటే..
ఐటీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చివరి తేదీని *2021 ఫిబ్రవరి 28కి* పొడిగిస్తూ తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
𒊹︎︎︎కరోనా కారణంగా స్థంభించిన కార్యక్రమాలన్నీ ఇంకా గాడిలో పడకపోవడం...
☘︎income tax filing due date extended: పన్ను చెల్లింపుదారులంతా ప్రతీ ఏట నిర్ధేశించిన నిర్ణీత గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. నిజానికి ప్రతీ ఏటా ఈ ఐటీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చివరి తేదీ జూలై 31గా ఉంటుంది. కానీ కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ తేదీని డిసెంబర్ 31కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.. అయితే తాజాగా ఈ గడువును మరోసారి పెంచారు.
➪ఐటీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చివరి తేదీని 2021 ఫిబ్రవరి 28కి పొడిగిస్తూ తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
కరోనా కారణంగా స్థంభించిన కార్యక్రమాలన్నీ ఇంకా గాడిలో పడకపోవడం, కొంత మంది ఉద్యోగులు సైతం కరోనా బారిన పడిన నేపథ్యంలో ఐటీ రిటర్న్ దాఖలు చివరి తేదీని మరోసారి పొడగించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం దేశవ్యాప్తంగా 5.25 కోట్ల మంది ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉండగా.. వీరిలో ఇప్పటికే 3.75 కోట్ల మంది సమర్పించినట్లు సమాచారం. ఇక మిగతా వారిలో ఎక్కువ శాతం మధ్య తరహ, కార్పొరేట్ కంపెనీలున్నాయి. ఇవి ఇంకా ట్యాక్స్ ఆడిట్ పూర్తి చేయని నేపథ్యంలో.. సదరు కంపెనీల అభ్యర్థన మేరకు గడువును మరోసారి పెంచారు.
0 Comments:
Post a Comment