రాష్ట్ర విద్యాశాఖ చేపట్టిన విధానాలు ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి, మనోవేదనకు గురి చేస్తున్నాయని ...
ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అమ్మఒడి అర్హులు, అనర్హుల జాబితాలు హడావుడిగా తయారు చేసి, 29న ప్రకటించాలని మార్గదర్శకాలు విడుదల చేశారని, అయితే గతేడాది అమ్మఒడి లబ్ధి పొందిన వారినీ ఈ ఏడాది అనర్హుల జాబితాలో/విత్ హెల్డ్‌లో ఉంచారని పేర్కొన్నారు. ఏ కారణంతో విత్‌హెల్డ్‌లో ఉంచారో ఆదివారం వరకూ తెలియలేదని తెలిపారు. హెచ్‌ఎం లాగిన్/వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌లో వాటిని సరిచేయాలని చెప్పారని, అయితే సచివాలయానికి వెళితే హెచ్‌ఎం దగ్గరికి వెళ్లాలని, హెచ్‌ఎంలకు కూడా అర్థం కాక సచివాలయాలకు వెళ్లండని చెప్పటం వల్ల నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు ఏమీ పాలుపోక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తప్పుగా నమోదు చేయటం, ఇటీవల జారీ చేసిన కొత్త బియ్యంకార్డులు అప్‌డేట్ కాకపోవటం, గార్డియన్స్ పేరుతో దరఖాస్తు చేసుకున్న వారు, తదితర కారణాలతో కొంత మంది లబ్ధిదార్లను విత్‌హెల్డ్‌లో ఉంచారని, మరోవైపు గడువు ముంచుకొస్తుండటంతో హెచ్‌ఎం, ఎంఆర్‌సి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొ న్నారు.
♦️మరోవైపు బదిలీలకు అప్షన్ల గడువును కుదించటంతో ఉపాధ్యాయులంతా ఒక్కసారిగా సైట్ ఓపెన్ చేయటంతో సర్వర్ సమస్య తలెత్తుతుందన్నారు. ఇప్పటికే ఆప్షన్లు పెట్టుకున్న వారికి వారు ఎంపిక చేసుకున్న క్రమంలో కాకుండా, క్రమం తప్పి వస్తుండటంతో ఫ్రీజ్ అయిన వాటిని అన్‌ఫ్రీజ్ చేసుకోవటానికి డిఇఒ ఆఫీసును సంప్రదించాల్సి వస్తుండటంతో ఉపాధ్యా యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. సులభంగా ముగిసే బదిలీలను బ్రహ్మ పదార్థం చేసి, కక్షసాధింపుగా వ్యవహరించటంతో రోజురో జుకూ సమస్యలు పెరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment