*📚✍ఆరా పదకొండా...?
♦టెన్త్ పేపర్లపై అస్పష్టత
♦ఎస్సీఈఆర్టీ తర్జనభర్జన
♦సంక్రాంతికి మూడే సెలవులు
🌻విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి చివరి
పరీక్షలను ఎన్ని ప్రశ్నా పత్రాలతో నిర్వహించాలనే అంశం ఇంకా స్పష్టతకు రాలేదు. 2020-21 విద్యా సంవత్సరానికి తరగతులను ప్రారంభించారు. కరోనా ప్రభావంతో ఈ విద్యా సంవత్సరం ఆలస్య ంగా ప్రారంభ మైంది. దీంతో సిలబస్‌ను 30శాతం వరకు కుదించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 30లోగా టెన్త్ సిల బసను పూర్తికి ఆదేశాలు జారీజేశారు. మేలో పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) డైరెక్టరు మంగళవారం వెబ్ కౌన్సెల్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పదో తరగతి పరీక్షా పేపర్లు ఎన్ని ఉంచాలనే దానిపై త్వరలో ఎస్సీఈఆర్టీ కీలక నిర్ణయం తీసుకోనుంది. కరోనా రీత్యా గత విద్యా సంవత్సరం (2019-20)లో టెన్త్ పేపర్లు ఆరు పేపర్లతోనే పరీక్షలకు ప్రభుత్వం సిద్ధమైంది. అనంతరం కరోనా కేసులు ఉధృతం కావడంతో పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులు చేసింది. పాత పద్ధతిలో పదో తరగతి పేపర్లు మొత్తం 11ఉంటాయి. హిందీ మినహా మిగిలిన సబ్జెక్టులకు పేపరు-1,2 చొప్పున ఉండేవి. ఈ విద్యా సంవత్సరం పాత పద్ధతి ఆధారంగా 11 పేపర్లు ఉంచుతారా? లేక 6 పేపర్లకు కుదిస్తారా? అనే దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీఈఆర్టీ తక్షణమే పది పేపర్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.
♦9,10 తరగతులకు ఎస్ ఏ-1 పరీక్షలు
పదో తరగతి పరీక్షా పేపర్లపై జనవర్ 6,7,8 తేదీల్లో 9,10 తరగతులకు | ఎన్ఏ (ఫార్మెటివ్ అస్సెస్మెంట్)-1 పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు మూడు రోజులే ఉంటాయని నిర్ధారించారు. గతంలో సంక్రాంతి సందర్భంగా దాదాపు పది రోజులు సెలవులిచ్చేవారు. కరోనా రీత్యా విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో..ప్రభుత్వం కుదించింది. ఈ సెలవుల తర్వాత 7,8 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తారు. అదే సమయంలో ఆరో తరగతి విద్యార్థులకు తరగతులు పున:ప్రారంభిస్తారు.
0 comments:
Post a comment