ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకి జైలుశిక్ష విధించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ధిక్కరణ కింద బాలకృష్ణమాచార్యులుకి వెయ్యి రూపాయల జరిమానా విధించిన హైకోర్టు జరిమానా చెల్లించని పక్షంలో వారంరోజుల జైలుశిక్ష అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే, కోర్టు సమయం ముగిసేవరకు హాల్లో కూర్చోవాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులును ఆదేశించింది.
0 Comments:
Post a Comment