ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) మరో శుభవార్త తెలిపింది. ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించారు. అయితే తాజాగా APSSDC మరో కీలక ప్రకటన చేసింది అరబిందో ఫార్మా కంపెనీలో 150 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 11న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం కోసం ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
బీ.ఫార్మసీ, డిప్లొమా, ఐటీఐ(ఎలక్ట్రానిక్, మెకానికల్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంటేషన్), బీఎస్సీ(కెమిస్ట్రీ) తదితర విద్యార్హతలు ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆయా కోర్సుల్లో 2017, 2018, 2019, 2020లో పాస్ అయిన వారు దరఖాస్తుకు అర్హులు, ఎంపికైన విద్యార్థులకు కంపెనీ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూకు హాజరైన విద్యార్థులకు టెక్నికల్, హెచ్ఆర్ రౌంట్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులు నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట మండలంలోని కంపెనీ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలంటే 9381265558, 8639835953 నంబర్లను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
0 Comments:
Post a Comment