Ap cm review meeting on manabadi nadu nedu:
🌼మనబడి నాడు-నేడు’పై సమీక్ష నిర్వహించిన జగన్.. వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు.
☀️ఏపీ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యలయంలో ‘మనబడి నాడు– నేడు, జగనన్న విద్యా కానుక’పై సమీక్ష నిర్వహించారు.
☀️ ఏపీ సీఎమ్ జగన్ మోహర్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యలయంలో ‘మనబడి నాడు– నేడు, జగనన్న విద్యా కానుక’పై సమీక్ష నిర్వహించారు.
☀️ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు పలువురు మంత్రులు అధికారులు హాజరయ్యారు.
☀️ఈ సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
☀️రెండో విడతలో భాగంగా ప్రైమరీ పాఠశాలలు 9,476, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 822, రెసిడెన్షియల్ స్కూళ్లు సహా హైస్కూళ్లు 2,771, జూనియర్ కాలేజీలు 473, హాస్టళ్లు 1,668, డైట్ కాలేజీలు 17, ఎంఆర్‌సీఎస్ 672, భవిత కేంద్రాలు 446 చోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..
☀️ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
☀️ఇందులో భాగంగానే టాయిలెట్ల కేర్ టేకర్లను ఏర్పాటు చేయనున్నారు.
🎯అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కింద చేపట్టనున్న కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలను వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
☀️వచ్చే ఏడాది విద్య కానుకపైనా సమీక్ష నిర్వహించిన జగన్.. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
0 Comments:
Post a Comment