ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో ఇకపై కుక్కలు, పందులకు లైనెస్న్ తప్పనిసరని రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జీ.వో నంబరు 693 జారీ చేసింది. ఇకపై లైసెన్స్ లేని కుక్కలు పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 జరిమానాతో పాటు రోజుకి రూ.250 అపరాధ రుసుము చెల్లించాలని జీవోలో పేర్కొంది. అధికారులు తనిఖాలకు వచ్చినప్పుడు పందులు, కుక్కలకు సంబంధించిన లైసెన్స్ చూపించాలని.. ఒకవేళ వాటి యజమానులుగా నిర్ధారణ కాకపోతే వాటిని వీధికుక్కలుగా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని పేర్కొంది. అలాగే కుక్కలు, పందుల లైసెన్స్ ముగిసిన 10రోజుల్లోగా రెన్యువల్ చేసుకవాలని సూచించింది.
పెంపుడు జంతువులకు యజమానులు ఖచ్చితంగా హెల్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. కుక్కలకు హెల్త్ సర్టిఫికెట్, పందులకు ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని అదేశించింది.
ఇక ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన టోకెన్లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉంచాలని పేర్కొంది. అంతేకాదు గ్రామాల్లో పెంపుడు కుక్కలు, పందులు, వీధి కుక్కలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి, గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకుడు, జిల్లా SPCA నామినేట్ చేసిన సభ్యులు, జంతు సంరక్షణ సంస్థల నుంచి ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.ఈ కమిటీ గ్రామ పంచాయతీల్లో పెంపుడు కుక్కలు, పందుల సంఖ్య, వాటి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అలాగే విధికుక్కలు, యజమానులు లేని పందులు, కుక్కలను గుర్తించి వాటిని పట్టుకోవడం, వెటర్నరీ ఆస్పత్రులకు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, టీకాలు వేయించడం వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అలాగే పెంపుడు జంతువులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. గ్రామాల్లో సంచరించే పందులపై గ్రామపంచాయతీ నిత్యం దృష్టి పెడుతూ వాటిని శివారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు తరలించాలని సూచించింది.
0 Comments:
Post a Comment