అమ్మఒడి మార్గదర్శకాలు ఇవీ..
ఆరంచెల విధానంలో దరఖాస్తుల పరిశీలన
లబ్ధిదారుల మొదటి జాబితా 16న విడుదల
☀️పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు అందించే ‘అమ్మఒడి’ పథకం మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పథకం కింద ఏటా రూ.15వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
☀️రాష్ట్రవ్యాప్తంగా 61,824 పాఠశాలలు, 3,617 జూనియర్ కళాశాలల్లో కలిపి 74,98,308 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి వివరాలను సేకరించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశారు.
🍁మొదటి జాబితా 16న
🎯గతేడాది లబ్ధిదారుల జాబితాను ఈనెల 16న సచివాలయం నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు. తల్లి, సంరక్షకుల ఆధార్, బ్యాంకు వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటిని ప్రధానోపాధ్యాయులు సరి చేస్తారు. అర్హతపై అభ్యంతరాలు వస్తే జాబితాను సంయుక్త కలెక్టర్‌కు సమర్పిస్తారు.
☀️గతేడాది విద్యార్థుల సంఖ్య ప్రకారం ఇంకా 3,39,342 మంది విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుకావాలి. ఈ ప్రక్రియను ప్రధానోపాధ్యాయులు ఈనెల 15లోపు పూర్తిచేస్తారు.
🎯15 వరకు నమోదుచేసిన విద్యార్థుల వివరాలను సమగ్ర ఆర్థిక వ్యవస్థ (ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్)కు అందిస్తారు. ఆరంచెల పరిశీలన తర్వాత అర్హుల జాబితాను 19న అమ్మఒడి పోర్టల్‌లో ఉంచుతారు.
☀️అర్హుల జాబితాను 20 నుంచి 24 వరకు పాఠశాలలు, సచివాలయ నోటీసు బోర్డులో ఉంచుతారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
🎯16న విడుదల చేసిన జాబితా, 20వ తేదీ జాబితాను క్రోడీకరించి, సరిదిద్దిన అభ్యంతరాలతో అర్హులైన తల్లులు, సంరక్షకుల తుది జాబితాను 26న అమ్మఒడి పోర్టల్‌లో ఉంచుతారు. ఈ జాబితాపై 27, 28వ తేదీల్లో గ్రామసభ ఆమోదం తీసుకుంటారు.
☀️ఆమోదం పొందిన జాబితాను గ్రామ సచివాలయ అధికారులు, ప్రధానోపాధ్యాయుడికి 29న ఆన్‌లైన్‌లో పంపిస్తారు. జిల్లా విద్యాధికారులు, కలెక్టర్లకు 30వ తేదీలోపు అందిస్తారు.
🍁జిల్లాల్లో సహాయ కేంద్రాలు..
🎯ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ, అమల్లో తలెత్తే సందేహాల నివృత్తికి డీఈవో కార్యాలయంలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
☀️అర్హులైన లబ్ధిదారులు తమ దరఖాస్తు వివరాలను ‘అమ్మఒడి’ పోర్టల్‌లో సరిచూసుకోవాలని పాఠశాల విద్య సంచాలకుడు చినవీరభద్రుడు తెలిపారు. వివరాల్లో ఏమైనా తప్పులుంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచించారు
AMMA VODI 2021 GUIDELIENS RELESED
అమ్మ ఒడి పథకం- షెడ్యూల్(2020-21)::
⊹ ఉత్తర్వుల సారాంశం::-
❖ డిసెంబర్ 9-25 వరకు అమ్మ ఒడి పై ముందస్తు చర్యలు ఉద్యమం స్థాయిలో జరుగును.
❖ చైల్డ్ ఇన్ఫో/ జ్ఞానభూమి పోర్టల్ లో నమోదు అయిన విద్యార్ధులను బట్టి అర్హులైన తల్లుల / సంరక్షకుల జాబితాను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి డిసెంబర్ 16 న జాబితాను విడుదల చేయడం జరుగుతుంది.
❖ ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 10-20 మధ్య విద్యార్థుల నమోదు/అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.
❖ డిసెంబర్ 10-15 మధ్యకాలంలో అప్డేట్ అయిన విద్యార్ధుల వివరాలు APCFSS వారికి డిసెంబర్ 15, సాయంకాలం 6 గంటలకు అందజేయబడుతుంది.
❖ వారు ఆ వివరాలను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను డిసెంబర్ 19, సాయంత్రం 6 గంటల తరువాత ఆ వివరాలను అమ్మ ఒడి పోర్టల్ లో ప్రకటిస్తారు.
❖ డిసెంబర్ 20-24 మధ్య అమ్మ ఒడి పోర్టల్ లో ప్రకటించిన వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో మరియు గ్రొమ/వార్డు సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.
❖ తల్లుల/ సంరక్షకుల ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు మరియు IFSC కోడ్ నెంబర్ లలో తప్పులు దొర్లితే ప్రధానోపాధ్యాయులు సరిదిద్దవలసి ఉంటుంది.
❖ అనర్హత పట్ల అభ్యంతరాలను గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా స్టాండర్డ్ ప్రొసీజర్ ద్వారా కలెక్టర్ వారికి సమర్పించవలసి ఉంటుంది. వీటిని జాయింట్ కలెక్టర్ వారు పరిష్కరిస్తారు.
డిసెంబర్ 16 న విడుదల చేసిన మొదటి జాబితా మరియు డిసెంబర్ 20 న విడుదల చేసిన జాబితా ను క్రోడీకరించి ,వీటిలోని సరిదిద్దిన అభ్యంతరాలతో గల తుది జాబితాను డిసెంబర్ 26 న అమ్మ ఒడి పోర్టల్ లో పొందుపరచడం జరుగుతుంది.
❖ తుది జాబితా డిసెంబర్ 27-28 న వార్డు/ గ్రామ సభచే ఆమోదం పొందవలసి ఉంటుంది.
❖ ఆమోదం పొందిన తుది జాబితాను గ్రామ/వార్డు విద్యా సంక్షేమ సహాయకుడు డిసెంబర్ 29 న ఆన్లైన్ ద్వారా అందజేయవలసి ఉంటుంది.
❖ ప్రధానోపాధ్యాయుడు డిసెంబర్ 30 లోగా మండల విద్యాశాఖ అధికారి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి వారికి అందజేయ వలసి ఉంటుంది.
❖ జిల్లా విద్యాశాఖాధికారి ఆ జాబితాను డిసెంబర్ 30 నాటికి జిల్లా కలెక్టరు వారి ఆమోదానికి సమర్పించ వలసి ఉంటుంది.
0 Comments:
Post a Comment