అమ్మఒడి జాబితా సవరణ నిమిత్తం గ్రామ సచివాలయాలకి లాగిన్ సౌకర్యం
జిల్లాలోని Grama Sachivalaya సిబ్బందికి జగనన్న అమ్మఒడి అనర్హుల జాబితా (IN ELIGIBILITY / With held )కు సంబంధించి గ్రీవెన్సు సవరించుటకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగినది
పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు ఎలిజిబుల్ లిస్టు, ఇన్ ఎలిజిబుల్ లిస్టు మరియు విత్ హెల్డ్ లిస్టు పలు మూడు రకాల లిస్టులు డిస్ ప్లె చేయబడ్డవి
ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్ హెల్డ్ లిస్ట్ లో ఉన్న తల్లులు ఆందోళన చెందకుండా మీకు సంబంధించిన గ్రామ సచివాలయముకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్స్ వెంటనే అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్ హెల్డ్ లిస్ట్ లో ఉన్న పిల్లల తల్లులు సంబంధిత డాక్యుమెంట్లు ఆరు అంచెల వెరిఫికేషన్(six steps verification) కొరకు గ్రామ సచివాలయాల నందు జరుపబడు social audit లొ సంబంధిత డాక్యుమెంట్స్ జతచేయించి అమ్మఒడి లబ్దిని పొందగలరు.
🌷గ్రామ సచివాలయ సిబ్బందికి సూచనలు 🌷
మీ ప్రాంత పరిధిలోని పాఠశాలలలోని అమ్మఒడి ఆనర్హుల జాబితాను సేకరించి ఆరు అంచేల వెరిఫికేషన్ (six steps verification) ప్రకారము సంబంధిత డాక్యుమెంట్స్ అందించిన తల్లిదండ్రులకు మీ లాగిన్ లో అప్లోడ్ చేసి వాటి పరిశిలన నిమిత్తం MPDO గారికి ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పంపించగలరు.
🌷మండల అభివృద్ధి అధికారులకు సూచనలు🌷
మీ లాగిన్ లో అమ్మఒడికి సంబంధించి వచ్చిన గ్రీవెన్సు ను ఎలాంటి ఆలసత్వం వహించకుండా వాటిని పరిశిలించి జాయింట్ కలెక్టరు డెవలప్మెంటు వారి లాగిన్ కు వెంటనే సంబంధిత డాక్యుమెంట్స్ తో forward చేయగలరు.
Note:జిల్లాలోని MPDO లు మరియు Grama Sachivalaya సిబ్బంది జగనన్న అమ్మఒడి కి సంబధించిన వివరములు ఎటువంటి ఆశ్రద్ద చేయకుండా తల్లులు ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకోని వెంటనే అప్ లోడ్ చేయవలసినదిగా ప్రత్యేకముగా తెలియజేయడమైనది.
🌷ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.
b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.
2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.
5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.
Sir we r very poor people we don't have any these six!but we got result not eligibility?
ReplyDelete