అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. ఇప్పటికే రూ. 10వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆ మొత్తాన్ని ఏపీ సర్కార్ చెల్లించిన సంగతి తెలిసిందే. తాజాగా మరింత మంది బాధితులకు నగదు చెల్లించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే.. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ. 1, 150 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇందుతో తొలి దశలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో 263.99 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన 3,69,655 మంది బాధితులకు 2019 నవంబర్‌లో నష్టపరిహారం చెల్లించింది.
తాజాగా రూ.20 వేల లోపు సొమ్ము డిపాజిట్ చేసి.. నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. అగ్రిగోల్డ్ అంశం న్యాయ స్థానాల పరిధిలో ఉండటంతో.. రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు తెలంగాణ హైకోర్టు గత నెల 9న ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ చెప్పారు.అయితే తొలి విడతలో రూ. 10వేల లోపు డిపాజిట్ చేసిన కొందరికి పరిహారం అందలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పది వేల రూపాయాలు డిపాజిట్లు చేసిన వారికి సైతం డబ్బులు అందకపోతే వారికి కూడా రూ.20 వేల డిపాజిట్లు చెల్లించినప్పుడు పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
0 comments:
Post a comment