💁♀️జనవరి 9న ‘జగనన్న అమ్మఒడి’ చెల్లింపులు: సురేశ్
🔰అమరావతి: జనవరి 9న ‘జగనన్న అమ్మఒడి’ రెండోవిడత చెల్లింపులు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అమ్మఒడి పొందేందుకు ఈనెల 10 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఆయన మీడియాకు చెప్పారు. ఈ నెల 16 నుంచి 19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా సిద్ధం చేస్తామని సురేశ్ వివరించారు. డిసెంబరు 20 - 24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తామన్నారు. 26న అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేస్తున్నామని మంత్రి సురేశ్ తెలిపారు
Mundu JVD 2 dabbulu veyandi sir
ReplyDelete