దేశంలోని ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సాధారణంగా పండుగలు, సెలవుల సమయంలో ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ డేస్ సేల్ పేరుతో గతంలో ఎప్పుడూ ఇవ్వని విధంగా భారీగా ఆఫర్లను ఇస్తోంది.
టీవీలు, ఏసీలు రిఫ్రిజిరేటర్లపై ఫ్లిప్ కార్ట్ దాదాపు 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఫర్నిచర్, గృహాలంకరణ, బ్యూటీ, క్రీడలు, ఇతర ఉత్పత్తులపై కూడా ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించడం గమనార్హం. హెడ్ఫోన్లు, స్పీకర్లపై ఫ్లిప్ కార్ట్ 50 నుంచి 70 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
చెప్పులు, షూస్, బట్టలపై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ల్యాప్ టాప్ లపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ ఇస్తూ ఉండటం గమనార్హం.
ల్యాప్ టాప్ లపై కూడా ఏకంగా 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్ లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉండటంతో కస్టమర్లు ఆఫర్లను వినియోగించుకుంటే ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు క్రిస్ మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈకామర్స్ సంస్థలు ఈ సంవత్సరం చివరి వారంలో మళ్లీ ఆఫర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈ కామర్స్ రంగంలో రోజురోజుకు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు తక్కువ ధరకే ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఆర్డర్ చేసిన ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తులు డెలివరీ అయ్యే అవకాశం ఉండటంతో చాలామంది ఈ కామర్స్ వెబ్ సైట్లపై ఆసక్తి చూపుతున్నారు.
0 comments:
Post a comment