🔳ఖాళీలన్నీ చూపితే 5 వేల బడుల మూత!
మారుమూల పాఠశాలల కోసమే బదిలీల్లో పోస్టుల బ్లాక్
మంత్రి ఆదిమూలపు సురేష్
ఖాళీలన్నీ చూపితే 5 వేల బడుల మూత!
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో కొన్ని పోస్టులను బ్లాక్ చేయకపోతే మారుమూల పాఠశాలలు మూతపడతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అన్ని ఖాళీలను బదిలీల్లో చూపితే రాష్ట్ర వ్యాప్తంగా 145మండలాల్లోని 5,725 పాఠశాలలపై ప్రభావం పడుతుందని, 10,195 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అవుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. బదిలీల ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 48,897 పోస్టులకు 16,007 మాత్రమే బ్లాక్ చేశామని, ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల నమోదు, సవరణలకు శుక్రవారం అర్ధరాత్రి వరకు అవకాశం కల్పించామని వెల్లడించారు. తప్పనిసరి బదిలీ కానున్న 26,117మందిలో 25,826మంది ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారని, అభ్యర్థన బదిలీల కోసం 50,002మంది దరఖాస్తు చేసుకోగా.. 48,595మంది ఐచ్ఛికాలు ఇచ్చారని వివరించారు. ఐచ్ఛికాల నమోదుకు సహకరించిన ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐచ్ఛికాల నమోదు, సవరణల కోసం ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఉండడంతో సర్వర్ సమస్య తలెత్తుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లాలవారీగా సర్వర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు
0 Comments:
Post a Comment