💁♀️డీఈవో కార్యాలయ ముట్టడి..
🔰400 మంది ఉపాధ్యాయుల అరెస్టు.
🍁మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి :
🔰ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలంటూ మచిలీపట్నంలో గురువారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు దాదాపు 400 మందిని అరెస్టు చేసి, చిలకలపూడి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ అరెస్టులను నిరసిస్తూ, మహిళా టీచర్లు బైఠాయింపు జరిపారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ ఆందోళనకు ఫ్యాప్టో చైర్మన్ ఇ.వి.రామారావు, సెక్రటరీ జనరల్ తమ్ము నాగరాజు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, ఫ్యాప్టో కో-చైర్మన్ పాండురంగ వరప్రసాద్, రాష్ట్ర కో-చైర్మన్లు శరత్చంద్ర, ఎస్.పి.మనోహర కుమార్, కొమ్ము ప్రసాద్‌లు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ రామారావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలను బ్లాక్ చేసేందుకు ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఫ్యాప్టో కో-చైర్మన్ పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ, అధికారుల అప్రజాస్వామిక వైఖరి వల్ల వీధికెక్కాల్సి వచ్చిందన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. బాబురెడ్డి మాట్లాడుతూ, కొత్త పోస్టులతో ఖాళీలను భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను రేషనలైజేషన్ పేరుతో తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆందోళనలో పాల్గొన్న దాదాపు 400 మంది ఉపాధ్యాయు లను పోలీసులు అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
0 comments:
Post a comment