✨ తెలంగాణ::
🌸 33% ఫిట్మెంట్తో త్వరలో పిఆర్సి?
★ త్వరలో ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉద్యోగులతో పాటు పింఛనర్లకు నూతన సంవత్సర కానుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.
★ ఈనెలాఖరులోగా పిఆర్సీ కమిషన్ పదవీకాలం పూర్తికానున్న ఈ నేపథ్యంలో సకల హంగులతో ఉద్యోగులకు మేలు చేసేలా పిఆర్సి నివేదిక సిద్ధమయినట్టుగా సమాచారం.
★ బిస్వాల్ కమిటీ నేతృత్వంలో 2018 మే 18వ తేదీన పిఆర్సి కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తోంది.
★ ఈనెల 28 లేదా 29వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నివేదికను పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ అందజేయనున్నట్టుగా సమాచారం.
*పిఆర్సీ నివేదికలో పేర్కొన్న అంశాలు ఇలా..!*
★ 33 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు ఇవ్వాలని పిఆర్సి కమిషన్ ఆ నివేదికలో సూచించినట్టుగా తెలుస్తోంది.
★ దీంతోపాటు కనీస పింఛన్‌ను రూ.6,500ల నుంచి రూ.10 వేల వరకు, ఉద్యోగుల కనీస వేతనాన్ని కూడా రూ.20 వేల వరకు పెంచాలని పిఆర్సీ నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం.
★ దీంతోపాటు హెచ్ఆర్ఏ స్లాబ్‌లను యధాతథంగా అమలు చేయడంతో పాటు, రిటైర్మెంట్ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచాలని, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు 30 శాతం, జిల్లా స్థాయిలో పనిచేసే వారికి 20 శాతం, మండల స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు 15 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని బిస్వాల్ కమిటీ ఈ నివేదికలో సూచించినట్టుగా సమాచారం.
★ దీంతోపాటు ఉద్యోగి యొక్క ఇంక్రిమెంట్ 3 శాతంగా కొనసాగించడంతో పాటు పూర్తి పింఛన్‌కు అర్హత కలిగిన సర్వీస్ 33 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలకు కుదించాలని, ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం (ఏఏఎస్‌ను 5,10,15,20,25)గా ఇవ్వాలని కమిషన్ సూచించినట్టుగా తెలిసింది.
★ ఇక నుంచి పదేళ్లకు ఒకసారి ఉద్యోగుల జీతభత్యాలపై సమీక్ష జరపాలని ఈ కమిషన్ సూచించినట్టుగా తెలుస్తోంది.
0 comments:
Post a comment