✍గడువు తీరిన డ్రైవింగ్ లైసెన్సులు మార్చి 31 దాకా పొడిగింపు
🌻న్యూఢిల్లీ డిసెంబరు 27: ఈ యేడాది ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్సు లు, "వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు వంటివాటిని 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర రవాణాశాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది కరోనా వైరస్ వ్యాపించి ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి వరకూ మూడుసార్లు ఈ గడువును పొడి గించింది. ఇదినాల్గవది. గత ఆగస్టులో డిసెంబరు 31, 2020వరకు పొడగింపు ఇస్తూ ప్రకటన చేసింది రవాణాశాఖ. ప్రస్తుతం ఇచ్చిన గడువు పొడిగింపువల్ల 2021 ఫిబ్రవరి 1, లేదా మార్చి 31లో గడువుముగిసే డాక్యుమెంట్లకు మేలు జరుగు తుంది. లైసెన్సు ల రెన్యూవల్ కోసం భౌతిక దూరం పాటించకుండా పెద్ద పెద్ద లైన్లలో నిలబడటం కొన్ని ప్రాంతాల్లో ఉన్న లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలకు వ్యతిరేకం కనుక లైసెన్సుల గడువును పొడిగిస్తు న్నట్లు కేంద్రరవాణాశాఖ పేర్కొంది.
0 Comments:
Post a Comment