అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ .. రైతుల ఖాతాల్లో రూ . 2 వేలు జమ
The union government : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. అందుకవసరమయ్యే నిధులను ఈ నెల 25న ప్రధాని నరేంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు.
దేశంలో మొత్తం 9 కోట్ల మందికి పైగా ఉన్న రైతులకు మరో విడత ఆర్థిక చేయూత అందించడం కోసం రూ.18,000 కోట్లకుపైగా ప్రధాని నిధులను విడుదల చేయనున్నారు. దేశంలోని రైతులందరికీ ఆర్థిక సాయం అందించడం కోసం ప్రధాని నరేంద్ర పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం కింద ప్రతి ఏడాది ఒక్కో రైతు ఖాతాలో రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తున్నారు.
అయితే ఈ ఆర్థిక సాయాన్ని ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఇస్తున్నారు.
ఈనెల 29 న ఖాతాల్లోకి డబ్బు
ఏపీలో రైతు భరోసా , ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించేందుకు వ్యవసాయ శాఖ కమిషనరకు ప్రభుత్వం అనుమతిచ్చింది . ఆధార్ లింక్ అయిన రైతుల ఖాతాలకు డబ్బును RTGS ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలంది . దీంతో ఈ నెల 29 న రైతు భరోసా , ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలను జమ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు .
0 Comments:
Post a Comment