ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్ పేమెంట్స్ భారత్‌లో దాదాపు రెండు కోట్ల మందికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌కు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, యాక్సెస్ బ్యాంకుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్ ఆధారంగా దీనిని తయారు చేశారు. పీర్ టూ పీర్ ఆధారంగా ఈ సేవలను ప్రారంభించారు. ఈ విధానంలో యూజర్ మెసేజ్ పంపినట్లే నగదును కూడా బదిలీ చేయవచ్చు.
దీనిపై వాట్సాప్ ఇండియా హెచ్ అభిజిత్‌బోస్ మాట్లాడుతూ ''మేము ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యక్సిస్ బ్యాంకులతో జట్టుకట్టేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాము.
దీంతో మా వినియోగదారులకు సురక్షితమైన, సరళతరమైన చెల్లింపు సేవలు లభిస్తాయి. యూపీఐ వంటి విప్లవాత్మకమైన మార్పును మా వినియోగదారులకు దగ్గర చేసి వారిని కూడా డిజిటల్ ఎకానమీలో భాగస్వాములను చేసే అవకాశం లభించింది'' అని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ సేవలకు దూరమైన గ్రామీణులకు కూడా యూపీఐతో కలిసి సేవలు అందిస్తామని వాట్సాప్ పేర్కొంది.
ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ చానల్ అండ్ పార్టనర్‌షిప్ విభాగం ప్రతినిధి మాట్లాడుతూ'' మా కస్టమర్ల నుంచి ఆశాజనకమైన స్పందన లభిస్తోంది. దాదాపు 20లక్షల మందికిపై వినియోగదారులు వాట్సాప్ నుంచి బ్యాంకింగ్ సేవలు పొందుతారు'' అని అభిప్రాయపడ్డారు.
0 Comments:
Post a Comment