ఈ రోజైనా సీనియారిటీ జాబితాలు విడుదలయ్యేనా ..?!
షెడ్యూల్ తేదీ దాటి 2 రోజులైనా విడుదల కాని వైనం
కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తి కాని దరఖాస్తుల ధ్రువీకరణ
షెడ్యూల్ ప్రకారం సీనియారిటీ జాబితా విడుదలకి ఈ రోజు చివరి తేదీ.
అమరావతి న్యూస్ టోన్
ఉపాధ్యాయ బదిలీల సీనియారిటీ జాబితాలు నేటికీ విడుదల కాలేదు. దీనికి సాంకేతిక అంశాల తో పాటు దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి కాక పోవడం కారణాలుగా తెలియ వచ్చింది. కొన్ని జిల్లాల్లో బదిలీ దరఖాస్తుల ధ్రువీకరణ ఇంకా పూర్తి కానందున ఆయా జిల్లాల్లో బదిలీల జాబితా విడుదల ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయపు ఐటి విభాగం ధ్రువీకరణ ఇంకా ఎందుకు పూర్తి కాలేదు అనే విషయం పై ద్రుష్ఱి సారించింది. ధ్రువీకరణ పూర్తి కాని ఉపాధ్యాయుల దరఖాస్తులు ఎందుకు పూర్తి కాలేదో రిమార్కులు పంపాలని అధికారులని కోరింది. బదిలీ దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి అయిన జిల్లాల్లో సీనియారిటీ జాబితాల విడుదల సాంకేతిక కారణాల వల్ల కావడం లేదు. రేపటి నుండి సీనియారిటీ జాబితాల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సి ఉన్నందున సాధ్యమైనంత త్వరగా సీనియారిటీ జాబితాలు విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
0 comments:
Post a comment