💁♀️16,008 ఖాళీలు బ్లాక్ చేశాం..
🔰బ్లాక్ చేయడం సాధారణమే.. కొత్తేమీ కాదు
🔰పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు
🔰వెబ్ కౌన్సెలింగ్‌తో ఎంతో ఉపయోగం..
🍁అమరావతి(ఆంధ్రజ్యోతి)/ఎర్రగొండపాలెం, డిసెంబరు 15:
🔰ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేయడం, వెబ్ కౌన్సెలింగ్‌పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మళ్లీ పాత పాటే పాడారు. ఉపాధ్యాయ బదిలీలు ఎప్పుడు చేపట్టినా ఖాళీలు బ్లాక్ చేయడం సర్వసాధారణమని, ఇప్పుడు కొత్తేమీ కాదని పునరుద్ఘాటించారు. తామేదీ దాచడం లేదని, బ్లాక్ చేసిన ఖాళీల వివరాలు కూడా వెల్లడిస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలన్న ఉద్దేశంతోనే పారదర్శకంగా ఉండేలా ఆన్లైన్ ద్వారా బదిలీలకు దరఖాస్తులు కోరామని, వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 4 కేటగిరీల్లో కలిపి మొత్తం 48,897 ఖాళీలుండగా వాటిల్లో 16,008 బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు
🔰ఇందులో కేటగిరీ-1లో 1,423, కేటగిరీ-2లో 1,962, కేటగిరీ-3లో 12,189, కేటగిరీ-4లో 434 ఖాళీలు ఉన్నాయని వివరించారు. కేటగిరీ-4 కింద ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు ఉపాధ్యాయులు లేకుండా ఉండరాదన్న ఉద్దేశంతోనే కేటగిరీ-1, 2, 3లోని ఖాళీలు ఎక్కువగా బ్లాక్ చేయాల్సి వచ్చిందన్నారు. బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఆప్షన్ పెట్టుకునేందుకు 32,889 ఖాళీలు ఉన్నాయన్నారు. మొత్తం 76,110మంది వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా మంగళవారం మధ్యాహ్నం వరకు 44,561 (58.55ు) మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారని చెప్పారు. సర్వర్ సమస్య కారణంగా వెబ్ ఆప్షన్ కోసం మరోరోజు అవకాశం ఇస్తామన్నారు. ఖాళీల బ్లాకింగ్ విషయంలో ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్న అపోహలపై చర్చించామన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్‌తోనే ఇబ్బందులు ఉంటాయన్నారు. టీచర్ల బదిలీలపై టీడీపీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ హయాంలో బదిలీలు జరిగినప్పుడు జిల్లాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడి, ఎవరు సస్పెండ్వుతారో అని భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడంతా పారదర్శకంగానే జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
0 comments:
Post a comment