10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
సౌత్ వెస్ట్రన్ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) ఐటిఐ, 12వ, 10వ తరగతి అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను ప్రకటించింది. అర్హతగల అభ్యర్థులు indianrailways.gov.inలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అథ్లెటిక్స్, బ్యాట్‌మెంటన్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, టెబుల్ టెన్నిస్, హాకీ తదితర క్రీడాంశాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/ అంతర్జాతీ స్థాయిలో ఆడి ఉన్న వారు అర్హులు. డిసెంబర్ 28 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.rrchubli.in/ చూడొచ్చు.
0 Comments:
Post a Comment