WhatsApp: It can be read even if it is deleted
వాట్సాప్: అలా డిలీట్ అయినా చదవొచ్చు
విండోస్ 10 యూజర్స్ కోసం వాట్సాప్ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. ఇందులో డిస్అపియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్స్ తాము పంపే మెసేజ్‌లు ఏడు రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. అయితే డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగి చూసేందుకు అవకాశం లేదా అంటే ఉందనే చెప్పొచ్చు. అవేంటో చూద్దాం!
* వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. దాన్ని మీరు ఓపెన్ చేయలేదు. ఏడు రోజులు తర్వాత ఛాట్ స్ర్కీన్‌లో ఆ మెసేజ్ డిలీట్ అయిపోయింది. కానీ మెసేజ్ ఓపెన్ చెయ్యలేదు కాబట్టి దాన్ని నోటిఫికేషన్స్ బార్లో చూడొచ్చు.
* ఛాటింగ్‌లో మెసేజ్‌ను స్వైప్ చేసి అవతలి వ్యక్తికి రిప్లై ఇచ్చారు.
ఏడు రోజుల తర్వాత మీకు వచ్చిన మెసేజ్ డిలీట్ అయిపోయింది. కానీ మీరు పంపిన రిప్లై మెసేజ్‌పై క్లిక్ చేస్తే డిలీట్ అయిన మెసేజ్ కనిపిస్తుంది. ఇది డిలీట్ మెసేజ్ చూసేందుకు మరో మార్గం.
* డిస్అపియరింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసిన వ్యక్తి నుంచి మీకు మెసేజ్ వచ్చింది. ఏడు రోజుల తర్వాత అది డిలీట్ అయిపోయింది. కానీ ఆ వారంలోపే మీరు ఛాట్ బ్యాక్ అప్ తీసుకుంటే... అందులో ఆ మెసేజ్ ఉండిపోతుంది. ఆ ఛాట్‌ను రెస్టోర్ చేసి మళ్లీ ఆ మెసేజ్ పొందొచ్చు.
* వాట్సాప్‌లో వచ్చే మీడియా ఫైల్స్ (ఆడియో, వీడియో, పీడీఎఫ్) వాటంతటవే డౌన్లోడ్ అవుతాయి. (మీరు డిజేబుల్ చేస్తే తప్ప). ఆటో డౌన్లోడ్ అయిన ఫైల్స్ కూడా ఏడు రోజుల తర్వాత ఛాట్‌లో డిలీట్ అయిపోతాయి. కానీ ఫోన్ స్టోరేజ్‌లో సేవ్ అవుతాయి కాబట్టి అక్కడ వాటిని చూడొచ్చు.
గమనిక: డిస్అపియరింగ్ ఫీచర్ కొంతమందికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ పొందొచ్చు.
0 comments:
Post a comment