ఒంట్లో కెలరీలు బాగా పెరిగి,సన్నబడాలని నిర్ణయించుకుంటే ఈ సూపర్ ఫుడ్స్ లాగించండి. ఇవి తింటే కొత్తగా బరువు పెరగకపోగా తగ్గుతారు కూడా. ఎంత కసరత్తులు చేసినా కొందరు సన్నబడరు ఇదంతా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కాదు. దీనికి కారణం తాము తినే ఆహారంలో అత్యధికంగా కెలరీలు ఉండటమే. దీనికి విరుగుడు లో కేలరీలున్న ఆహారాన్ని మీరు తినకపోవటమే. అలాగని కెలరీలు అస్సలు లేని ఆహారం తిన్నారో గోవిందా ఎందుకంటే ఇలాంటి జీరో కెలరీ ఫుడ్ లో పోషకాలు అస్సలు ఉండవు మరి. ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉందని అనుకుంటే ఒక్క మాట తెలుసుకోండి. మన శరీరానికి అవసరమైన శక్తిని ఇచ్చేది మనం తినే ఆహారంలోని కెలరీలే. తక్కువ కెలరీలున్న ఆహారం తింటే మన ఒంట్లో ఇప్పటికే నిల్వ ఉన్న కొవ్వు కరిగి, సన్నబడి, ఆరోగ్యంగా తయారవుతాం అన్నమాట.
ఇక లో-క్యాల్ డైట్ ను ఎలా ఎంపిక చేసుకోవాలన్నది అసలు సమస్య. ఈ కింద పేర్కొన్న లో కెలరీ ఫుడ్‌ను మీరు సదా గుర్తుంచుకుంటే అంతే చాలు.
బాడీ ఫ్ల్యూయిడ్స్ను బ్యాలెన్స్ చేసేది నీరే. నీరు బాగా తాగుతూ, నీరు అధికంగా ఉన్న ఆహారాన్ని తింటే మీకు కడుపు నిండిన భావన సంపూర్ణంగా కలగడమే కాక అనవసరంగా ఆకలి కేకలు పుట్టవు. దీంతో ఏదిపడితే అది తినాలనే చపలత్వం తగ్గుతుంది.
మనదేశంలో గ్రీన్ టీ వాడకం ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉన్న దీంతో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇన్ఫక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడే గ్రీన్ టీ సన్నబడాలనుకునే వారికి ఫస్ట్ చాయిస్ గా ఉండి తీరాల్సిందేనని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
తీగ జాతి కూరగాయలైన గుమ్మడి, దోస, బీర, పొట్ల, కాకర, సొర కాయ వంటి కూరగాయల వాడకం పెంచాలి. వీటిలో కెలరీలు చాలా తక్కువ ఉంటాయి. మెటాబిలిజం రేటు బాగా పెరిగి, కడుపు మంట వంటి సమస్యలకు చెక్ పెట్టే ఔషధ గుణాలు ఈ జాతి కూరగాయల్లో హెచ్చుగా ఉంటాయి. ఏ విటమిన్ తో కూడిన బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటితో సలాడ్లు, కూరలు, పప్పు, సాంబర్ ఇలా మీకు నచ్చినవి వండుకుని లాగించవచ్చు. ఇలా వండేందుకు ఎక్కువ నూనెలు మాత్రం వాడకండి.
బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించేవి ఆకుకూరలే. ఫైబర్ నిల్వలు బాగా ఉన్న తాజా ఆకుకూరలతో మీరు బరువు తగ్గడమే కాదు, మలబద్ధకం, పోషకాల లేమి, ఇతరత్రా సమస్యలన్నీ అధిగమించవచ్చు.
సీజనల్ పళ్లు తినటంతో మీ బరువు బాగా తగ్గుతుంది. ఈ లిస్ట్ లో నిమ్మ జాతి పళ్లకు అగ్రతాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే వీటిలో నీటి శాతం ఎక్కువ. సీ విటమిన్, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ ఎక్కువ కనుక వీటితో బరువు తగ్గడం చాలా ఈజీ. ఆరోగ్యాన్ని పెంపొందించే HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, lower harmful LDL cholesterol , ట్రై గ్లిసరైడ్స్ ను తగ్గిస్తాయి కనుక దానిమ్మ, సంత్రా, బత్తాయి వంటి పళ్లను హ్యాపీగా లాగించండి. పళ్లు సూపర్ ఫుడ్స్ కదా అని కేజీలకొద్దీ, డజన్ల కొద్దీ తినేయకండి, పుచ్చకాయ వంటివాటిలో 92శాతం నీరే ఉంటాయి, ఇవి తినడం వల్ల శరీర బరువును క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
అల్లంలో తక్కువ కేలరీలుంటాయి. వెల్లుల్లి, అల్లంలో ఉండే సుగుణాల కారణంగా మన శరీరంలోని కొవ్వు నిల్వలు క్రమంగా కరుగుతాయి. కనుక మీరు తినే ఆహారంలో ఈ రెండూ ఉండేలా చూసుకోండి, దీంతో రుచి పెరగడమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది.
కూరగాయలతో చేసిన తాజా సూపులు (ఇంస్టంట్ కాదు) తాగడంతో బరువు తగ్గచ్చు. ఇవి తక్కువ కెలరీలున్న ఆహారం కావడమే కాదు మంచి విటమిన్లు, మినరల్సు ఉంటాయి కనుక ఆకలైనప్పుడు ఓ కప్పు సూపు తాగితే కడుపు నిండినట్టు వెంటనే అనిపిస్తుంది. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు.
సీ విటమిన్ పుష్కలంగా ఉన్న నిమ్మకాయలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి మీరు తినే ఆహారానికి మరింత రుచి వచ్చేలా చేసే నిమ్మకాయను మెనూలో చేర్చుకోండి. దీంతో నిమ్మకాయ జ్యూస్ చేసుకుని తాగినా మంచిదే. తక్షణం మీ ఆకలిని తీర్చే నిమ్మకాయ జ్యూస్ మీ బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్ లో నిమ్మకాయలను ఎప్పుడూ నిల్వ ఉండేసా చూసుకోండి.
0 comments:
Post a comment